సుగ్రీవుని భయము బాప బ్రహ్మచారివై పరబ్రహ్మము
ను చేరి మైత్రీ భంధం నెరపితివి మా భయము తీర్చి
పరబ్రహ్మము ను చేర్చ మాకభయ మొసంగవేలనే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
రామ దయను రాజ్యము పొంది రమణుల
పొందులో ఏమరిచి మిత్ర కార్యము
మరచిన కపి రాజును హితవచనముల
మేల్కొలిపి శేషుని శర పరంపరల
బడనివ్వక కాచిన బుద్దిమతి మము
యమ పాశముల పాల్బడనీయక పాలించవే

అమ్మ అన్వేషణకై కపి మూకను పంపు వేళ అయ్య
మదికేమి తోచనో అంగుళీయకము నీకిచ్చెనయ్య
అంతటి ఘనుడవు మాకిన్చుక ఘనత నీయవే

సాగరం లంఘించు సమర్ధుడెవ్వడోయని
కపి వీరులేల్లరు కలత చెందు వేళ గురు
వృద్ధుడు జాంబవంతుని చే జాగృతి నొందిన
జవసత్వములచే ఉప్పొంగితివి కృంగిన మా
నవనాడుల జాగృతి తో పొంగించవయా

రామ కార్యము సాధించబోవు సదవకాశము చిక్కెనేయను
తలంపు తనువు తాకగ నే పొంగిన ఎదతో సింహనాదము
చేసితివి సత్కార్యములవైపు మము నడిపించవే

లక్ష్య సాధనలో అలసత్వము కూడదనుచు మోహింప
చేయు మైనాకుని ఆహ్వానం తోసిరాజంటివి మము
కమ్ముకున్న మోహబంధనాలేల తెంచకుంటివి

మ్రింగ నెంచి నాగమాత నోరు పెంచగా అదను చూసి
అంగుష్ట మాత్రమున అంగిట చేరి వచ్చిన బుద్దిమతి
ముంచ నెంచు కష్టముల కడలి దాటు బుద్ధి మాకొసగవే

నీడను పట్టి నిలువరించు సింహికను చేబలముతో
సాగరమున ముంచితివి నిస్సత్తువ ఆవరించిన
మా నరములకు సడలని సత్తువ నివ్వవే

No comments:
Post a Comment