ప్రభాతాన ప్రభవించే ప్రభాకరునికి
సొబగులద్దుతూ కుసుమించే సుమబాల నీవు
నిశీధిలో ముడుచుకుని నీ దర్శనతో వికసనం
పొందే వేకువ పొద్దును నేను
సడీసప్పుడు లేకుండా మృదువుగా మేని తాకి
ఆహ్లాదమిచ్చు శీతల మధుర వీచిక నీవు
నీ తాకిడితో చిరాకు చిటపటలు వీడి
చిరునగవుల లాహిరిలో వూగే దరహాస చంద్రుడ నేను
కమ్మని కలల కమలపు విరితోటతో నిండిన
నిర్మల సరోవర నెచ్చెలి నీవు
ఆ నిర్మలసరోవర తరంగాలపై తేలియాడు
పాల నురగ పరవశంబు నేను
గులకరాయి ని కాను గుండె గూటిలో గుడికట్టిన
గండు తుమ్మెదను కాని