hari

hari
hari naamaamrutam

Search This Blog

Pages

Total Pageviews

Popular Posts

Translate

Tuesday, June 24, 2025

గులకరాయి


 ప్రభాతాన ప్రభవించే ప్రభాకరునికి

సొబగులద్దుతూ కుసుమించే సుమబాల నీవు
నిశీధిలో ముడుచుకుని నీ దర్శనతో వికసనం
పొందే వేకువ పొద్దును నేను
సడీసప్పుడు లేకుండా మృదువుగా మేని తాకి
ఆహ్లాదమిచ్చు శీతల మధుర వీచిక నీవు
నీ తాకిడితో చిరాకు చిటపటలు వీడి
చిరునగవుల లాహిరిలో వూగే దరహాస చంద్రుడ నేను
కమ్మని కలల కమలపు విరితోటతో నిండిన
నిర్మల సరోవర నెచ్చెలి నీవు
ఆ నిర్మలసరోవర తరంగాలపై తేలియాడు 
పాల నురగ  పరవశంబు నేను
గులకరాయి ని కాను గుండె గూటిలో గుడికట్టిన 
గండు తుమ్మెదను కాని