hari

hari
hari naamaamrutam

Search This Blog

Pages

Total Pageviews

Popular Posts

Translate

Saturday, August 23, 2014

మాధవీ పరిణయం

మాధవీ పరిణయం 

అన్నా !
 
పెళ్ళికి ఎందుకు రాలేదు ?
 
ఈ  ప్రశ్న అడగరానిది కదా ,
 
చెల్లి జీవితంలో భాగం కాబోతున్న అందమైన ప్రపంచానికి శుభాహ్వానం 
పలుకుతూ జరిపే మహోత్సవాన్ని చూడకుండా ఎ అన్న అయినా వుండగలడా 
 
 మరి ఎందుకు అడిగినట్లు 
ఎపుడో కార్తీకం లో బవిరి గడ్డం తో చూసిన ముఖం . మద్యలో కొన్ని కార్తీకాలు కరిగిపోయిన తరువాత తిరిగి 
కార్తీకంలో జరుగుతున్న ఈ ఆనంద సమయంలో  అనేకానేక ఆత్మీయ అతిదేయుల మధ్య చుసిన వేంటనే 
గుర్తించాలంటే కష్టమే మరి 
 
పెళ్లి జరిగిన బహుకొద్ది రోజులకే ఫోన్ చేసి ప్రశ్నిస్తున్న చెల్లి ఆప్యాయతకు మురిసిపోతూ కాలాన్ని  ఒక్కసారి వెనక్కి త్రిప్పితే 
 
 
నవంబరు 9 శనివారం సాయంత్రం 8 గంటలు  ఆకుపచ్చని ఉద్యానవనం అనే పూటకూళ్ళ ఇల్లు (గ్రీన్ పార్క్ హోటల్ అమీర్ పేట్ )
 
 చల్లని రాతిరి సమయాన చల్లని దారుల వెంట నడుచుకుంటూ చల్లని గదిలోకి ప్రవేశించి ముందు వరుసలో ఆసీనులైన వారిలో  చెల్లి కోసం చూపులు  ప్రసరింప చేసి చూపుకు చిక్కక పోవటంతో  అందివచ్చిన   చల చల్లని పానీయం  అందిపుచ్చుకుని వెనుక వరసలో చతికిలపడ్డాను 
 అలా ఒక్కసారి తలత్రిప్పి అపరిచితుల  మద్య సుపరిచితులకై వెదుకులాడుతున్నంతలో   అతిధులను ఆప్యాయంగా పలకరిస్తూ అమ్మ కనిపించింది

దగ్గరకు వెళ్లి అమ్మా నే కిరణ్
ఓహ్ కిరణ్ బాగున్నావా చెల్లి పైన గదిలో  వుంది వస్తుంది కూర్చో  ఆదరంతో కూడిన సమాధానం 
హమ్మయ్య గుర్తు పడతారో లేదో నన్న సందేహం తీరి గుర్తున్నానన్న ఆనందం
 
 కూర్చుని చూపులను ముందుకు సారిస్తే ముందు వరుసలో గింగిరులు తిరిగిన ఉంగరాల జుట్టుతో రాబోయే నవ వధువు ను చూడటానికి వున్నా రెండు కనులు సరిపోవని బింబాన్ని ప్రతిబింబింప చేయు మరో రెండు చక్రాల వంటి అద్దాలను ఆసరా chesukuni   గోధుమ వర్ణానికి చెందిన రంగుతో చూడ చక్కగా వున్న షేర్వాని (పేరు ఏదైనా సర్దుకు పోండి) ధరించిన ఓ యువరత్నం

ఓ ఇతడే మాధవ హరుడు హరిహరుడు కాబొలు , కాబోలు ఏమిటి ఇతడే పోల్చుకోవటం పెద్ద కష్టమేమి కాదు
ఇంతలో మంగళ వాయిద్యాల ధ్వని
ఓహ్ చెల్లి రాబోతున్నదన్న మాట
చంద్రిక వర్ణపు (పింక్) చీరలో నడిచోస్తున్న చందమామ లా చిరు సిగ్గులు బుగ్గలపై పూయిస్తూ అందమైన కొప్పుతో అలా నడిచి వస్తున్న మా చిట్టి తల్లిని చూసి మురిసిపోతూ నుంచున్న

 ఇంతలో పంతులుగారి హడావుడి మొదలయ్యింది
అదే ఎదురుకోలు ఉత్సవం
యువరాజా వారు రాచ టివీ ఒలికిస్తుంటే యువరాణి పరివారం నును సిగ్గులు ఒలికిస్తూ ఆహ్వానం పలకటం
పంతులుగారు జాబితా విప్పారు ఎవరెవరు వచ్చారో ఈ వేడుకకు మనము చూద్దామా

అంగ వంగ కళింగ మత్స్య మగధ మాంచాల కోసల కాంభోజ కాశ్మీర  గాంధార కురు విరాట పాంచాల మల్ల చేది  మొదలుగా గల సంస్థానధీశు లెందరో విచ్చేసిన ఈ స్వయంవర మంటపం లో ............ 
దండధరులైన  ఉద్దండులెన్దరున్న కోదండధారి యగు రాముని కే జానకి వరమాల        
హరిహరుడే మాధవ మానస చోరుడు        
 కాలం మారింది దానితో పాటే ట్రెండు మారింది ఆశ్వ రధారూడులై రావాల్సిన రాచ పరివారం
 కార్లలో కొలువు చేరింది
సరే సరే తరువాత
పంతులుగారు ద్విపాత్రాభినయం చేస్తున్నారు అబ్బాయి తరుపున అమ్మాయి తరుపున
బింకం ప్రదర్శిస్తూ అబ్బాయి వైపుకు ఒక అడుగు మాత్రమే వేయమని అమ్మాయికి
మనసులోని ఆతృతను అదిమి పట్టి అమ్మాయి వైపుకు రెండు అడుగులు వేయమని అబ్బాయికి
చుట్టుప్రక్కల మూగిన బంధు గణపు చెణకులు ఏమైనప్పటికీ ఇందులోని అంతరార్ధాని తెలుసుకో యత్నిస్తే ......  
అమ్మాయి వేసే తోలి అడుగు .... వరుడి వంశం లోని గడచిన ఏడు తరాలవారిని ఉద్దరించటానికి  రాబోయే ఎడుతరాలపాటు వంశ వృక్షాన్ని నిలబెట్టటానికి నీకు ఆధారమై నిలుస్తానని సంకేత సూచిక       
అమ్మాయి వేసే రెండో అడుగు...... సమస్యల సాగరాన్ని ఈదుతూ అలజడి నొందు నీ మనసుకు స్వాంతన నిచ్చు నిర్మల నదీతుంగా ప్రవాహమై నీతో జీవితకాలం నడిచోస్తానని సంకేతం
అమ్మాయి వేసే మూడో అడుగు .... జీవిత పరమార్ధాన్ని తెలుసుకునే యత్నంలో చేయు వేదోక్తమైన కర్మాచరణకు చేదోడుగా నిలుస్తానని ఇచ్చే హామీ
అందుకే స్త్రీ వేసే ప్రతి అడుగు ఎంతో ఔన్నత్యం   తో   కూడి వుంటుంది
అదే స్త్రీ యొక్క గొప్పదనం
అందుకే వివాహ బంధం
అందుకు మగవారికి ఆడతోడు అవసరం

ఆ సంబరం ముగిసి వధూ వరులిద్దరూ వేదికపై ఆసీనులవటం
పెద్దలు అతిథులు ఆశీర్వచనాలు పలకటం మామూలే కదా

నేను వేదిక నెక్కి అక్షితలు వేసి క్రిందకు దిగుతుండగా మా కెప్టన్  గారు ఆనందాంతరంగులై   వేదిక ప్రక్కనే

 ఇందు వివాహ సమయంలో గడకర్రల వంటి పొడగరుల  మద్య నుండి ఆ వేడుక చూచి ఆనందించటానికి విఫల యత్నం చేసిన వామనుడు నేడు త్రివిక్రముడై గోలోకం నుండి  మాధవి పరిణయాన్ని చూస్తూ మురిసిపోతూ ఆ మాధవుడి పాదపద్మాలపై నిలిచివున్న మల్లి మందారాలను తీసుకుని మాధవ హరులపై   పుష్ప వర్షాన్ని కురిపిస్తున్న దృశ్యం కడు రమణీయం (గమనించితివా )
 
 
ఆ వేడుక అలా కొనసాగుతుండగా ఆరుబయట సిద్దంగా వున్న వేడి వేడి కమ్మని పదార్ధాలు ఘుమ ఘుమ లాడుతుండగా విందారగించి (తిని చాల కాలమయింది కదా పెరుగు వడలు మాత్రం బాగా గుర్తున్నాయి) తిరుగు పయనమయ్యాను

తొలి అంకానికి తెర దించి      మలి అంకానికి తెరలేపుతుండగా 

No comments: