hari

hari
hari naamaamrutam

Search This Blog

Pages

Total Pageviews

Popular Posts

Translate

Wednesday, May 27, 2015

నందమూరి తారక రామా

1960 తెలుగు నాట మరువ లేని సంవత్సరం
ఏడుకొండలపై కొలువైన వేంకటనాధుడు  వెండి తెరపై దివ్య దర్శన మిచ్చిన సమయం

 శ్రీనివాసుడే కదలి వచ్చాడా  అని సంబ్రమాశ్చర్యాలతో వూరు వాడా పిల్లా పెద్ద అందరిని ఏకం చేసి చద్ది అన్నపు మూటలు ఎడ్ల బండ్లకు వేలాడ గట్టి   తన వైపుకు ఆకర్షించుకున్న ఆ సుందర రూపం
ఎవరీతడు  ఏమా అద్భుతమైన చిరు దరహాసం

ఒక్కసారి ఆలోచిస్తే అంతకు ముందు  37 సంవత్సరాల క్రితం  1923 మే 28 న
నిమ్మకూరు లో వెంకటరామమ్మ లక్ష్మయ్య దంపతులకు జన్మించిన ఓ చిట్టి బుడతడు   
ఇంతితై వటుడింతై వెండితెరపై తరగని వెలుగై రాజకీయ యవనిక పై చెరగని సంతకం చేసి
తెలుగు జాతి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేసే వరకు  సాగించిన జీవన ప్రస్థానం అందరికి
ఆదర్శ ప్రాయం
ఆయనే నందమూరి తారక రాముడు 
శ్రీరాముని సౌందర్యాన్ని శ్రీకృష్ణుని లీలా విలాసాలను
రావణుడి రాజసాన్ని సు యోధనుడి అహాన్ని కర్ణుడి దాతృత్వాన్ని
ఇచ్చిన మాటకు కట్టుబడే భీష్ముని ధీరత్వం అర్జునుడి సమరశీలత
 శ్రీకృష్ణ దేవరాయలి సాహితీపిపాస  తల్లి తండ్రుల పట్ల పుండరీకుని సేవా నిరతి
 వీర జవాను దేశ భక్తి చెల్లి పట్ల అన్న కుండే ఆపేక్ష
ఇన్ని గుణాల కలబోసి రూపుదిద్దుకున్న నిండైన రూపం
నందమూరి తారక రాముడు 
అవన్నీ ఆయన సహజ గుణాలు కనుకే వాటిని తెరపై ప్రదర్శించినపుడు
నిజమే ననుకున్నారు కాని నటన అనుకోలేక పోయారు  
ప్రత్యేక ఉద్యమం ఎగసి పడుతున్న వేళ
రాజకీయ వాసనలేవి దరి చేరని నాడే సొంత లాభం కన్నా తెలుగు జాతి క్షేమమే
ముఖ్యమని సొంత చిత్రం లో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ 
కలసి వుంటే కలదు సుఖమని చాటిన ఘనుడు
మనుషుల లోని సంకుచిత భావాల పునాదులపై తమ అధికార పునాదులు నిర్మించుకునే నాయకులెవ్వరూ
తేరిపార చూడలేని మేరునగ ధీర గంభీరుడు 
 
తెలుగు వారికి రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు
కష్టకాలంలో జోలె పట్టి ఆపదలో వున్న వారికి కలసి కట్టుగా  సహాయ పడే తత్వాన్ని
అలవాటు చేసిన మహానుభావుడు
ఇలా చెప్పుకుంటూ పొతే మనకు అలుపు రావాల్సిందే కాని ఆయన గొప్పతనానికి తరుగు రాదు
భగవద్గీతను చదివి అర్ధం చేసుకోవాలే కాని యుద్దానికి ముందు అది చెప్పటం సాధ్యమా అని వ్యర్ధ ప్రశ్నలు సంధించటం అవివేకం

యుగ పురుషుల జీవితాలు అంతే

విమర్శించు  వారు వేవేలు అందురు గాక ఆయన జీవన ప్రస్థానాన్ని అర్ధం చేసుకుని
ఆ గుణాలను అలవర్చుకోవటానికి ప్రయత్నించేవారు విజయశిఖరాలు అందుకునే తీరతారు
అపర భీష్మావతారా  నందమూరి తారక రామా 
 ప్రేమతో మీ 

No comments: