hari

hari
hari naamaamrutam

Search This Blog

Pages

Total Pageviews

Popular Posts

Translate

Friday, July 10, 2015

యతి తపోతలం

యతి  తపోతలం
యతులు మహర్షులు తపమాచరించిన ప్రశాంత సుందర ప్రదేశం
చుట్టూ చిన్న చిన్న కొండలు 
ఓ వైపు కొండల మీదుగా సుమారు 22 అడుగుల ఎత్తులో  పైనుండి  క్రిందకు దుముకుతూ
ఆ కొండల నడుమ వడి వడి గా సాగిపోయే 
చిరు  జలపాతం
ఎవరో ఏరి కూర్చి పేర్చారా అన్నట్లు కనిపించే అందమైన కొండ చరియలు
పవిత్రమైన మర్రి మేడి వేప వృక్షాలు
అక్కడక్కడ కనిపించే మొగలి పొదలు
అంతకు మించి అంతర్లీనంగా ఆ వాతావరణం లో ఇమిడిపోయిన దివ్యత్వం తాలూకు అనుభూతులు
ఆ దివ్యత్వానికి కారణమేమో ?
బహుశా కృతయుగం నాడె ఋషులకు జ్ఞాన భోధ చేయటానికి అక్కడ తిరుగాడిన శ్రీ దత్తాత్రేయుల వారి పాద పద్మాల చేత పునీతమైన భూమాత పులకరింతా
లేక మునుల కోరిక పై ఆనాటి నుండి అక్కడె స్థిరంగా నిలచిన దత్తుని దివ్య మంగళ స్వరూపం నుండి వెలువడే కాంతి పుంజమా
లేక కృతయుగం నుండి ద్వాపరం వరకు దత్తుని ప్రత్యక్ష పర్యవేక్షణలో తపమాచరించి కలియుగంలో
గుప్త దేహాలతో తపమాచరిస్తున్న మహర్షుల తపో మహిమో

కారణమేదైనా చూచి తీరవలసిన మహిమాన్విత ప్రదేశం
మహితాత్ములు మహోన్నత ప్రాంతాలు జన సంచారానికి దూరంగా తమను తాము గుప్తం గా ఉంచుకొంటాయి

అలాంటి ఒక దివ్య స్థలి. ఈ యతి తపో తలం
అది కాలాంతరంలో యతి పోతల గా మారి  చివరకు ఎత్తి పోతల గా  స్థిర పడింది
గుంటూరు జిల్లా లోని మాచర్లకు 15 కి. మి. ఇటు నాగార్జున సాగర్ కు కూడా అంతే దూరం లో వున్న
దివ్య దత్త క్షేత్రమ్
శ్రీ దత్తాత్రేయుడు స్వయంభువు గా నిలచిన అతి కొద్ది క్షేత్రాలలో 2 ఆంద్ర ప్రదేశ్ లో వున్నాయి
ఒకటి కాకినాడ సమీపం లోని పిటాపురం కాగ ఇంకొకటి ఎత్తి పోతల
ఇక్కడ శ్రీ దత్తుడు మదుమతి దేవి (అనఘా దేవి) సమేతుడై  ఆరు భుజాలతో చిన్న కొండ గుహలో  నిలిచి వున్నారు
ఆ ప్రక్కనే వున్న బిల మార్గం ద్వారా మహర్షులు శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున దర్శించి వస్తుంటారు
మానవ కల్పిత అపరిశుబ్రత  ఎంతగా వున్నా ఆ ప్రాంతంలో దాగిన దివ్యత్వం మనసును కట్టిపడేస్తుంది
చూచి తీరాల్సిన చక్కని ప్రదేశం ఎత్తి పోతల
ఆ కొండ చెంతనే శ్రీదేవి భూదేవి సమేతుడైన శేష శయనుడు రంగ నాధుని దివ్య మంగళ స్వరూపం మనసును అలజడుల నుండి సేద తీరుస్తుంది 
మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్త జయంతి 
దత్త దత్త అని స్మరించిన మాత్రం చేతనే చెంత నిలిచి చేదోడు వాదోడుగా నడిచే గురు స్వరూపం 
శ్రీ దత్తుడు 

జై గురుదత్త 
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 
శ్రీ నృసింహ సరస్వతీ స్వరూపా గాణగాపుర నివాసా శ్రీ దత్తా శరణు 
 క్రిష్ణ సుతీరే వసతి ప్రసిద్ధం 
శ్రీపాద  శ్రీ వల్లభ యోగమూర్తిం 
సర్వజనైశ్చింతిత కల్పవృక్షం 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 
 
 
 
 
 

Wednesday, June 24, 2015

గోలోక బృందావనం

గోలోక బృందావనం
అత్యున్నత ఆధ్యాత్మిక ధామం
సాక్షాత్ ఆ గోవిందుడు నివసించే దివ్య ధామం

ఆ లోకాన్ని చేరుకోవటానికి అతి సులభమార్గం ఆ చిన్ని కృష్ణుని పాద పద్మాలపై నిశ్చలమైన ప్రేమ
ఆ లోకపు వర్ణన మన మాటలకు  అందేది కాదు అక్కడ మనసులు పొందే అనుభూతి అనుభవించటానికే తప్ప వివరించటానికి సాధ్య మయ్యేది  కాదు
అక్కడికి చేరుకోవటానికి సాధన అవసరం . ఒకసారి చేరుకున్నమా ఇక వెనుతిరిగే అవసరమే రాదు
హద్దులు లేని సంతోష సాగరం లో విహారమే ప్రతి క్షణం
ఒక్క సారి ఆ గోలోకపు సౌందర్యాన్ని వీక్షిస్తే
దినమంతా ఉదయకాలపు సౌమ్యత తో కూడిన వెలుగులే తప్ప తీక్షణత తెలియని భానుడు
సాయం వేళ వృద్ది తప్ప క్షయమేరుగని వెన్నెల రేడు చందురుడు చిందించు పసిడి కాంతులు
భూమాత ఆకుపచ్చని చీర కట్టుకుందా అనిపించే పచ్చిక బయళ్ళు
ఆకాశాన్ని  ముద్దాడుతున్నాయా అనిపించే పర్వత శిఖరాలు
ఆ పర్వతాలపై గంధపు వాసనలతో మైమర్పింప చేయు చందన వృక్షాలు
ఆ పర్వత శ్రేణుల పై నుండి జల జల జోరుతో జాలువారు జలపాతాలు
పర్వతాల నడుమ నుండి హోయలోలికిస్తూ గల గల సవ్వడుల తో సాగే నదులు
 
ఘనమైన హృదయ భారం మోయలేక వంగిన నాజూకు నడుము కల నవయవ్వనవతి లా
మధుర రసాలు స్రవించు ఫల భారం తో వంగిన కొమ్మలు గల వృక్షాలు
సౌగంధికా పరిమళాలు వెదజల్లు పారిజాతాలు  మల్లెలు , సుకుమారులైన సన్నజాజులు
రాచ టీవి ఒలికించు గులాభిలు , ముద్దొచ్చే మందారాలు  ముద్దబంతులు తో కూడిన పూల వనాలు
సువాసనలు వెదజల్లెడు తులసి వనాలు
నలుపు ఎరుపుల వర్ణ మిశ్రమంతో కూడిన గోమాతల అంబా రావాలు
చెంగు చెంగున గెంతే లేగ ల పదఘట్టన ల తాకిడికి ఎగసిన ధూళీ తో
ఎర్రని మేఘమేదొ కనుల ముందు పరుచుకుందా  అనిపించే  ధూళీ మేఘాలు

అబ్బ అంతేనా
నిర్మలమైన సరోవరాలు ఆ  సరోవరాలకు నిండు తనమిచ్చిన కలువ బాలలు , కమలపు విరిబోణులు
ఆ పద్మాల హృదయ మకరందం కోసం విచ్చేసిన ఝుంటి తుమ్మెదల ఝుంకారాలు
రూప సౌందర్యంలో ఆ గోవిందుడి సారూప్యత పొందిన గోపాలకులు
 లలిత లావణ్యం తో ముగ్ధ మనోహరం గా నిత్య యవ్వనంతో శోబిల్లు గోపాంగనలు
చెవుల కింపుగా సాగే ఋషుల వేద గానాలు
మనసును రంజింప చేయు గంధర్వుల గానాలు కిన్నెరా కాంతల నాట్య భంగిమలు

నిరంతరం మృదు మధురంగా మేను తాకుతూ పూల  సువాసనలతో పాటుగా మానస చోరుడు
వెన్నదొంగ  వెన్నుని వేణు నాద తరంగాలను మోసుకొచ్చే వాయు లీనాలు  
ఇంతటి రసరమ్య మైన సుందర నందన వనాలతో కూడిన ఆ బృందావని లో
కవుల కల్పనలకు అందని ఆ రాదా  కృష్ణుల  ప్రణయ కావ్యాన్ని చూచి తీర వలసినదే
ఆ గోవిందుని పాదాల చెంత నిరపేక్ష నిరపాయ నిశ్చల నిర్మల మధురానుభూతులు పంచె
జీవితాన్ని కోరుకోవటం కోసం తపిద్దాం


Wednesday, May 27, 2015

నందమూరి తారక రామా

1960 తెలుగు నాట మరువ లేని సంవత్సరం
ఏడుకొండలపై కొలువైన వేంకటనాధుడు  వెండి తెరపై దివ్య దర్శన మిచ్చిన సమయం

 శ్రీనివాసుడే కదలి వచ్చాడా  అని సంబ్రమాశ్చర్యాలతో వూరు వాడా పిల్లా పెద్ద అందరిని ఏకం చేసి చద్ది అన్నపు మూటలు ఎడ్ల బండ్లకు వేలాడ గట్టి   తన వైపుకు ఆకర్షించుకున్న ఆ సుందర రూపం
ఎవరీతడు  ఏమా అద్భుతమైన చిరు దరహాసం

ఒక్కసారి ఆలోచిస్తే అంతకు ముందు  37 సంవత్సరాల క్రితం  1923 మే 28 న
నిమ్మకూరు లో వెంకటరామమ్మ లక్ష్మయ్య దంపతులకు జన్మించిన ఓ చిట్టి బుడతడు   
ఇంతితై వటుడింతై వెండితెరపై తరగని వెలుగై రాజకీయ యవనిక పై చెరగని సంతకం చేసి
తెలుగు జాతి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేసే వరకు  సాగించిన జీవన ప్రస్థానం అందరికి
ఆదర్శ ప్రాయం
ఆయనే నందమూరి తారక రాముడు 
శ్రీరాముని సౌందర్యాన్ని శ్రీకృష్ణుని లీలా విలాసాలను
రావణుడి రాజసాన్ని సు యోధనుడి అహాన్ని కర్ణుడి దాతృత్వాన్ని
ఇచ్చిన మాటకు కట్టుబడే భీష్ముని ధీరత్వం అర్జునుడి సమరశీలత
 శ్రీకృష్ణ దేవరాయలి సాహితీపిపాస  తల్లి తండ్రుల పట్ల పుండరీకుని సేవా నిరతి
 వీర జవాను దేశ భక్తి చెల్లి పట్ల అన్న కుండే ఆపేక్ష
ఇన్ని గుణాల కలబోసి రూపుదిద్దుకున్న నిండైన రూపం
నందమూరి తారక రాముడు 
అవన్నీ ఆయన సహజ గుణాలు కనుకే వాటిని తెరపై ప్రదర్శించినపుడు
నిజమే ననుకున్నారు కాని నటన అనుకోలేక పోయారు  
ప్రత్యేక ఉద్యమం ఎగసి పడుతున్న వేళ
రాజకీయ వాసనలేవి దరి చేరని నాడే సొంత లాభం కన్నా తెలుగు జాతి క్షేమమే
ముఖ్యమని సొంత చిత్రం లో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ 
కలసి వుంటే కలదు సుఖమని చాటిన ఘనుడు
మనుషుల లోని సంకుచిత భావాల పునాదులపై తమ అధికార పునాదులు నిర్మించుకునే నాయకులెవ్వరూ
తేరిపార చూడలేని మేరునగ ధీర గంభీరుడు 
 
తెలుగు వారికి రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు
కష్టకాలంలో జోలె పట్టి ఆపదలో వున్న వారికి కలసి కట్టుగా  సహాయ పడే తత్వాన్ని
అలవాటు చేసిన మహానుభావుడు
ఇలా చెప్పుకుంటూ పొతే మనకు అలుపు రావాల్సిందే కాని ఆయన గొప్పతనానికి తరుగు రాదు
భగవద్గీతను చదివి అర్ధం చేసుకోవాలే కాని యుద్దానికి ముందు అది చెప్పటం సాధ్యమా అని వ్యర్ధ ప్రశ్నలు సంధించటం అవివేకం

యుగ పురుషుల జీవితాలు అంతే

విమర్శించు  వారు వేవేలు అందురు గాక ఆయన జీవన ప్రస్థానాన్ని అర్ధం చేసుకుని
ఆ గుణాలను అలవర్చుకోవటానికి ప్రయత్నించేవారు విజయశిఖరాలు అందుకునే తీరతారు
అపర భీష్మావతారా  నందమూరి తారక రామా 
 ప్రేమతో మీ 

Friday, May 15, 2015

నరుడు నవగ్రహాలు

నరుడు నవగ్రహాలు
జీవనం యాంత్రికమై మనసు దుర్భలంగా మారిన
   కాలం లో
అననుకూల పరిస్థితులకు తాళలేక వాటిని గెలవ లేక గ్రహ శాంతుల కోసం
నవ గ్రహాల చుట్టూ పరిబ్రమించటం నేడు సర్వ సాధారణమయ్యింది.
  
మరి ఈ నవ గ్రహాలను శాంతింప చేయటమెల 
అసలు నిజంగానే నవగ్రహాల ప్రభావం మన మీద ఉంటుందా
ఒకరు  ఈ దానాలు చేయండి అని చెబుతారు
మరొకరు ఈ జపాలు చేయించండి అంటారు
ఇవన్నీ మనకు అనుకూలిస్తాయా 
ఎంతో కొంత ధనం ఇస్తే ఓ పండితుడు చేసే జపం మన గతిని మారుస్తుందా
అసలేమిటి ఈ నవ గ్రహాలూ ఎక్కడ వున్నాయి ఎక్కడో వుండి మనలను
ప్రభావితం చేస్తున్నాయా

పరిశీలనం చేస్తే మనలోనే ఈ నవ గ్రహాలూ వున్నాయి మనలను ప్రభావితం చేస్తున్నాయి
నవగ్రహధిపతి  సూర్యుడు    ఆకాశ వీధిలో తిరుగుతూ సమస్త ప్రాణ కోటికి చైతన్యం ఇస్తున్నట్లే
మన శరీరం లోను వెన్నుపూస మొదలయ్యే చోట చిన్న జ్యోతి రూపం లో నిలిచి
మన ప్రాణ జ్యోతి నిలబెడుతున్నాడు
మనః కారకుడైన చంద్రుడు మన మెదడు ను ప్రభావితం చేస్తూ అక్కడ  వున్నాడు
(చంద్రుని కళల ను అనుసరించి సముద్రపు అలలు ప్రభావితమినట్లు ఆ సముద్రపు తీరును పోలిన మన మనసు చంద్రుని చే ప్రభావిత మవుతుంది )  
భూమాత పుత్రుడైన కుజుడు మనలో ప్రసరించే శక్తి రూపం లోను
మన యొక్క సౌమ్య గుణ రూపంలో బుదుడు, బుద్ధి రూపకం గా బృహస్పతి  
సుఖాపేక్ష భావనా రూపకం గా శుక్రుడు , మనం చేసే పనుల కారణం గా సంభవించే ఫలితాల
రూపకంగా శని, మన శ్వాసను నియంత్రించే సర్ప రూప నాడులుగా రాహు కేతువులు మనలోనే
నిలిచి వున్నారు   
మనలో నిలిచి మనలను ప్రభావితం చేసే నవగ్రహాలను మనకు అనుకూలం గా మార్చుకోగల అవకాశం
లేదా వాటి ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునే మార్గం మన చేతుల్లోనే వుంటుంది 
లోకం మొత్తం అక్షరం మీదే ఆధారపడి వుంది. అక్షరాన్ని శబ్దం గా మార్చి క్రమ పద్దతిలో దానిని ఉపయోగించటం ద్వారా మన పూర్వీకులు అద్బుతాలు సృజించారు .  ఆ స్థాయిలో కాకపోయినా నేటి మనిషి ఉపయోగించే ఆధునిక పరికరాలు (కంప్యూటర్, మొబైల్ )  ఆ అక్షరం  శబ్దం మీద ఆధార పడినవే .
మనం కూడా అదే అక్షరాలను వుపయోగించి మనలో నిలచిన నవ గ్రహాలను మనకనుకూలం గా మార్చుకోవచ్చు
ప్రతి రోజు సూర్యోదయానికి ముందు ఓ 40 నిమిషాల పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా మనకు నచ్చిన
భగవన్ నామాన్ని జపించటం ద్వారా  మనలోని చైతన్య జ్యోతిని ప్రజ్వలింప చేసుకుని తద్వారా వుత్పన్నమయ్యే అనుకూల తరంగాల ద్వారా నవ గ్రహ ఫలితాలను నియంత్రించుకోవచ్చు 
 అనవసర ఆందోళనలు నానా విధపు ప్రయాసలు వీడి వేద ప్రతి పాదితమైన భగవాన్ నామాన్ని పదే పదే స్మరించటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు
(సూచన : ఇదంతా నా ఆలోచన ద్వారా నాకు కలిగిన భావాల సంపుటి. ఇది అర్ధ రహితమైనది గా విజ్ఞులు భావిస్తే క్షంతవ్యులం ) 

Thursday, May 14, 2015

హనుమ ఓ అర్ధం కాని ప్రశ్న

హనుమ ఓ అర్ధం కాని ప్రశ్న
హనుమాన్ ఓ సుందర రూపం మనసును ఇట్టే ఆకర్షించే దైవం
వయసుతో నిమిత్తం లేకుండా అందరు ఇష్ట పడే తమ వాడి గా భావించుకునే ఓ ఆత్మీయ నేస్తం
ఆయనేమీ శ్రీరాముని వలె ఆజాను బాహుడు కాదు తామర రేకుల వంటి కనులు కల వాడు కాదు
శ్రీకృష్ణుని వలె పారిజాత సుమాలను ధరించి కస్తూరి పరిమళాలతో ఒప్పారు లలితమైన దేహ సౌందర్యం కల వాడు కాదు

ఓ వానరుడు మరి నరులనే కాదు నానా రకాల జీవాలను సైతం ఎలా తన వైపు ఆకర్షించుకోగలుగుతున్నాడు  

అంటే మన మనసులను ఆకర్షించేదేమిటి శారీరక సౌందర్యమా లేక వ్యక్తిత్వపు సౌందర్యమా
శారీరిక సౌందర్యమైతే   హనుమ వైపు మనసు ఎందుకలా పరుగులు తీస్తుంది
ఆయనను చూడగానే మనసులో ఏదో తెలియని ఆత్మీయ భావం ఉప్పొంగుతుంది
పరిశీలిస్తే ఆయన వైభవమంతా ఆయన మాట తీరు లోను నడవడిక లోను అడుగడుగునా ప్రతిఫలిస్తుంది
మనం మాట్లాడితే మన మాటకు ముఖం లో కనిపించే భావాలకు పొంతన వుండదు
ఎదుట మనిషి ముఖం లోకి చూస్తూ ఓ నిమిషమైన మాట్లాడలేము
కాని ఆయన మాట్లాడిన మొదటి సారే శ్రీరాముని చేత ఇంతటి వ్యాకరణ పండితుడు మరొకరు లేరని
కితాబు నిప్పించుకోగాలిగారు
స్పష్టత తో కూడిన మృదువైన వాక్కు , ఎటువంటి వికారాలు పలికించని ముఖ కవళికలు ఆయన సొంతం
సమయానుకూలం గా ఎల్లపుడు హితకరమైన వచనాలు పలుకటం , మాటలో వినయాన్ని ప్రదర్శించటం
ఎంత సాధించిన అహంకారం దరి చేర నీయకుండ అణుకువతొ వ్యవహరించటం
చే పట్టిన పని మీద అమిత శ్రద్ద ఆసక్తి కలిగి వుండటం , మద్యలో ఎటువంటి ఆకర్షణలు కలిగినా లొంగక పోవటం  
చక్కని విషయ పరిజ్ఞానం కలిగి వుండటం , సమయోచితమైన సలహాలు ఇవ్వగల నేర్పు ఇవన్ని ఒక్క మనిషిలో చూడాలనుకుంటే ఆ రూపమే హనుమ

ఒకానొక వేళ ఇంద్రుడు అర్జునుడు గరుడుడు ఆదిశేషుడు  ప్రహ్లాదుడు వీరంతా అహంకరించిన వారే
కాని అహంకారమన్నది దరి చేరని ఒకే ఒక్క మూర్తి హనుమ
ఆయనలోని సుగుణాలన్నీ ఆయన దేహాన్ని కాంతివంతం చేసి మనలను ఆయన వైపుకు ఆకర్షించు కోగలుగుతున్నాయి. మనం కుడా ఇలాంటి సుగుణ సంపద పెంచుకుంటే మన దేహాలు కూడా కాంతి పుంజాలై  వెలుగొందుతాయి 
మల్లెల పరిమళాలను అక్కడ ప్రసరించే వాయువు ఆ ప్రాంతమంతా వ్యాపింప చేసినట్లు
మన మనసులోని ఉదాత్త భావాల పరిమళాలను మన లో చరించే వాయువు మన దేహమంతా వ్యాపింప చేసి మన శరీరాలను ఆకర్షణీయం గా చేస్తుంది.
శారీరిక సౌందర్యపు ఆకర్షణ తాత్కాలిక ఉద్రేకం లోనుండి పుడుతుంది అది నిలిచేది అతి కొద్ది కాలం
అది సంతోషాన్ని ఇవ్వలేదు

కాని వికసించిన వ్యక్తిత్వపు సౌందర్య ఆకర్షణ ఎవ్వరినైన ఇట్టే కట్టి పడేస్తుంది . కలకాలం నిలిచి వుంటుంది
ఇదే హనుమ మనకు నేర్పేది..... నా అర్ధం కాని ప్రశ్నకు హనుమ ఇచ్చిన అర్ధవంతమైన సమాధానం