గోలోక బృందావనం
అత్యున్నత ఆధ్యాత్మిక ధామం
సాక్షాత్ ఆ గోవిందుడు నివసించే దివ్య ధామం
ఆ లోకాన్ని చేరుకోవటానికి అతి సులభమార్గం ఆ చిన్ని కృష్ణుని పాద పద్మాలపై నిశ్చలమైన ప్రేమ
ఆ లోకపు వర్ణన మన మాటలకు అందేది కాదు అక్కడ మనసులు పొందే అనుభూతి అనుభవించటానికే తప్ప వివరించటానికి సాధ్య మయ్యేది కాదు
అక్కడికి చేరుకోవటానికి సాధన అవసరం . ఒకసారి చేరుకున్నమా ఇక వెనుతిరిగే అవసరమే రాదు
హద్దులు లేని సంతోష సాగరం లో విహారమే ప్రతి క్షణం
ఒక్క సారి ఆ గోలోకపు సౌందర్యాన్ని వీక్షిస్తే
దినమంతా ఉదయకాలపు సౌమ్యత తో కూడిన వెలుగులే తప్ప తీక్షణత తెలియని భానుడు
సాయం వేళ వృద్ది తప్ప క్షయమేరుగని వెన్నెల రేడు చందురుడు చిందించు పసిడి కాంతులు
భూమాత ఆకుపచ్చని చీర కట్టుకుందా అనిపించే పచ్చిక బయళ్ళు
ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అనిపించే పర్వత శిఖరాలు
ఆ పర్వతాలపై గంధపు వాసనలతో మైమర్పింప చేయు చందన వృక్షాలు
ఆ పర్వత శ్రేణుల పై నుండి జల జల జోరుతో జాలువారు జలపాతాలు
పర్వతాల నడుమ నుండి హోయలోలికిస్తూ గల గల సవ్వడుల తో సాగే నదులు
ఘనమైన హృదయ భారం మోయలేక వంగిన నాజూకు నడుము కల నవయవ్వనవతి లా
మధుర రసాలు స్రవించు ఫల భారం తో వంగిన కొమ్మలు గల వృక్షాలు
సౌగంధికా పరిమళాలు వెదజల్లు పారిజాతాలు మల్లెలు , సుకుమారులైన సన్నజాజులు
రాచ టీవి ఒలికించు గులాభిలు , ముద్దొచ్చే మందారాలు ముద్దబంతులు తో కూడిన పూల వనాలు
సువాసనలు వెదజల్లెడు తులసి వనాలు
నలుపు ఎరుపుల వర్ణ మిశ్రమంతో కూడిన గోమాతల అంబా రావాలు
చెంగు చెంగున గెంతే లేగ ల పదఘట్టన ల తాకిడికి ఎగసిన ధూళీ తో
ఎర్రని మేఘమేదొ కనుల ముందు పరుచుకుందా అనిపించే ధూళీ మేఘాలు
అబ్బ అంతేనా
నిర్మలమైన సరోవరాలు ఆ సరోవరాలకు నిండు తనమిచ్చిన కలువ బాలలు , కమలపు విరిబోణులు
ఆ పద్మాల హృదయ మకరందం కోసం విచ్చేసిన ఝుంటి తుమ్మెదల ఝుంకారాలు
రూప సౌందర్యంలో ఆ గోవిందుడి సారూప్యత పొందిన గోపాలకులు
లలిత లావణ్యం తో ముగ్ధ మనోహరం గా నిత్య యవ్వనంతో శోబిల్లు గోపాంగనలు
చెవుల కింపుగా సాగే ఋషుల వేద గానాలు
మనసును రంజింప చేయు గంధర్వుల గానాలు కిన్నెరా కాంతల నాట్య భంగిమలు
నిరంతరం మృదు మధురంగా మేను తాకుతూ పూల సువాసనలతో పాటుగా మానస చోరుడు
వెన్నదొంగ వెన్నుని వేణు నాద తరంగాలను మోసుకొచ్చే వాయు లీనాలు
ఇంతటి రసరమ్య మైన సుందర నందన వనాలతో కూడిన ఆ బృందావని లో
కవుల కల్పనలకు అందని ఆ రాదా కృష్ణుల ప్రణయ కావ్యాన్ని చూచి తీర వలసినదే
ఆ గోవిందుని పాదాల చెంత నిరపేక్ష నిరపాయ నిశ్చల నిర్మల మధురానుభూతులు పంచె
జీవితాన్ని కోరుకోవటం కోసం తపిద్దాం