hari

hari
hari naamaamrutam

Search This Blog

Pages

Total Pageviews

Popular Posts

Translate

Friday, July 10, 2015

యతి తపోతలం

యతి  తపోతలం
యతులు మహర్షులు తపమాచరించిన ప్రశాంత సుందర ప్రదేశం
చుట్టూ చిన్న చిన్న కొండలు 
ఓ వైపు కొండల మీదుగా సుమారు 22 అడుగుల ఎత్తులో  పైనుండి  క్రిందకు దుముకుతూ
ఆ కొండల నడుమ వడి వడి గా సాగిపోయే 
చిరు  జలపాతం
ఎవరో ఏరి కూర్చి పేర్చారా అన్నట్లు కనిపించే అందమైన కొండ చరియలు
పవిత్రమైన మర్రి మేడి వేప వృక్షాలు
అక్కడక్కడ కనిపించే మొగలి పొదలు
అంతకు మించి అంతర్లీనంగా ఆ వాతావరణం లో ఇమిడిపోయిన దివ్యత్వం తాలూకు అనుభూతులు
ఆ దివ్యత్వానికి కారణమేమో ?
బహుశా కృతయుగం నాడె ఋషులకు జ్ఞాన భోధ చేయటానికి అక్కడ తిరుగాడిన శ్రీ దత్తాత్రేయుల వారి పాద పద్మాల చేత పునీతమైన భూమాత పులకరింతా
లేక మునుల కోరిక పై ఆనాటి నుండి అక్కడె స్థిరంగా నిలచిన దత్తుని దివ్య మంగళ స్వరూపం నుండి వెలువడే కాంతి పుంజమా
లేక కృతయుగం నుండి ద్వాపరం వరకు దత్తుని ప్రత్యక్ష పర్యవేక్షణలో తపమాచరించి కలియుగంలో
గుప్త దేహాలతో తపమాచరిస్తున్న మహర్షుల తపో మహిమో

కారణమేదైనా చూచి తీరవలసిన మహిమాన్విత ప్రదేశం
మహితాత్ములు మహోన్నత ప్రాంతాలు జన సంచారానికి దూరంగా తమను తాము గుప్తం గా ఉంచుకొంటాయి

అలాంటి ఒక దివ్య స్థలి. ఈ యతి తపో తలం
అది కాలాంతరంలో యతి పోతల గా మారి  చివరకు ఎత్తి పోతల గా  స్థిర పడింది
గుంటూరు జిల్లా లోని మాచర్లకు 15 కి. మి. ఇటు నాగార్జున సాగర్ కు కూడా అంతే దూరం లో వున్న
దివ్య దత్త క్షేత్రమ్
శ్రీ దత్తాత్రేయుడు స్వయంభువు గా నిలచిన అతి కొద్ది క్షేత్రాలలో 2 ఆంద్ర ప్రదేశ్ లో వున్నాయి
ఒకటి కాకినాడ సమీపం లోని పిటాపురం కాగ ఇంకొకటి ఎత్తి పోతల
ఇక్కడ శ్రీ దత్తుడు మదుమతి దేవి (అనఘా దేవి) సమేతుడై  ఆరు భుజాలతో చిన్న కొండ గుహలో  నిలిచి వున్నారు
ఆ ప్రక్కనే వున్న బిల మార్గం ద్వారా మహర్షులు శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున దర్శించి వస్తుంటారు
మానవ కల్పిత అపరిశుబ్రత  ఎంతగా వున్నా ఆ ప్రాంతంలో దాగిన దివ్యత్వం మనసును కట్టిపడేస్తుంది
చూచి తీరాల్సిన చక్కని ప్రదేశం ఎత్తి పోతల
ఆ కొండ చెంతనే శ్రీదేవి భూదేవి సమేతుడైన శేష శయనుడు రంగ నాధుని దివ్య మంగళ స్వరూపం మనసును అలజడుల నుండి సేద తీరుస్తుంది 
మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్త జయంతి 
దత్త దత్త అని స్మరించిన మాత్రం చేతనే చెంత నిలిచి చేదోడు వాదోడుగా నడిచే గురు స్వరూపం 
శ్రీ దత్తుడు 

జై గురుదత్త 
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 
శ్రీ నృసింహ సరస్వతీ స్వరూపా గాణగాపుర నివాసా శ్రీ దత్తా శరణు 
 క్రిష్ణ సుతీరే వసతి ప్రసిద్ధం 
శ్రీపాద  శ్రీ వల్లభ యోగమూర్తిం 
సర్వజనైశ్చింతిత కల్పవృక్షం 
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే